HYD: హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

11చూసినవారు
HYD: హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
TG: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పరిధిలో ఉన్న పసిఫికా హిల్‌క్రెస్ట్‌ అపార్ట్‌మెంట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్