
వైసీపీకి భారీ షాక్.. పలువురు సీనియర్లు టీడీపీలో చేరిక
AP: స్థానిక ఎన్నికల వేళ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మంగళగిరిలో, పలువురు సీనియర్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడి టీడీపీలో చేరారు. మంత్రుల సమక్షంలో జరిగిన ఈ చేరికల్లో మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి మండలాలకు చెందిన మునగాల మల్లేశ్వరరావు, ఆయన సతీమణి, కళ్లం సంజీవ్ రెడ్డి, జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దొంతిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి, కట్టెపోగు బాబురావు, అలాగే గుంటూరు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేమవరపు నారాయణ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరిని ఉండవల్లి నివాసంలో టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.






































