
బైక్కు నిప్పంటించిన వాహనదారుడు
హైదరాబాద్లోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు, ఒక వాహనదారుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో, ఎస్ఐతో గొడవపడిన అజామ్ అనే వాహనదారుడు తన బైక్కే నిప్పంటించాడు. ఈ ఘటనలో బైక్ పాక్షికంగా దగ్ధమైంది. స్థానికుల సహాయంతో పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చారు.
















