
ఉప్పుగూడలో తొవ్వి వదిలేసిన రోడ్డు నిర్మాణ పనులు, డ్రైనేజీ మరమ్మతులు
ఉప్పుగూడ నుండి ఛత్రినాఖ వెళ్లే దారిలో, వివేకానంద నగర్ వీధిలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు, కాంక్రీట్ రోడ్డు నిర్మాణం కోసమని రోడ్డు తవ్వారు. దానికి ఎదురు వైపుగా ఉన్న ఒక వీధిలో కూడా రోడ్డును తవ్వేశారు. ఇంకో వీధిలో డ్రైనేజ్ మరమ్మతుల పనులు మధ్యలో ఆగిపోయాయి. ఆ మూడు వీధుల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని స్థానికులు, -వాహనదారులు కోరుతున్నారు.




















