
రోడ్లు క్లీన్ చేయకుండా రోడ్ స్వీపర్‌తో చక్కర్లు
చార్మినార్, మసీద్‌బండ, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో రహదారుల శుభ్రత కోసం వినియోగించే మెకానికల్ రోడ్ స్వీపర్ వాహనాలు రోడ్లు శుభ్రం చేయకుండానే ఖాళీ రోడ్లపై నడుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో డీజిల్‌తో పాటు ప్రజాధనం వృథా అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి వాహనాల వినియోగంపై తనిఖీలు చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.





















