
చెడ్డీ గ్యాంగ్ కలకలం.. మహిళపై ఆయుధాలతో దాడి
హైదరాబాద్‌లోని మణికొండలో ఆదివారం తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ఆరుగురు అనుమానితులు ప్రవేశించారు. లేక్‌సైడ్ ఫెన్సింగ్‌ను కత్తిరించి C-బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో చోరీకి పాల్పడ్డారు. దొంగతనాన్ని అడ్డుకునేందుకు యత్నించిన మహిళపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.




























