
తెలంగాణ భవన్లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
ఖైరతాబాద్, గోషామహల్ ప్రాంతాలలో తెలంగాణ భవన్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.





















