
రన్నింగ్ కారుపై కూర్చొని మద్యం తాగిన యువతి
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ ప్రాంతంలో శనివారం ఒక యువతి కారుపై కూర్చొని బహిరంగంగా మద్యం సేవిస్తూ హల్చల్ చేసింది. రన్నింగ్ కారు పైభాగంలో కూర్చొని ఆమె చేసిన ఈ విన్యాసాలను వెనుక వస్తున్న మరో వాహనదారుడు తన కారులోని డాష్‌క్యామ్ ద్వారా రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రమాదకరమైన రీతిలో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఈ యువతి చర్యపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



















