
బంగారం వ్యాపారి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
చిక్కడపల్లి బంగారం వ్యాపారి శ్రీనివాసరావు కిడ్నాప్ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు కిడ్నాపర్లకు రూ.కోటిన్నర చెల్లించి శ్రీనివాసరావును విడిపించుకున్నారని సమాచారం. అయితే కిడ్నాపర్ల చెర నుంచి తానే స్వయంగా బయటపడ్డానని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పడంతో అనుమానం బలపడింది. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో కిడ్నాప్ ముఠాలోని ఏడుగురిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.




























