కార్వాన్ - Karwan

గంజాయి మత్తులో యువకుడిపై కత్తులతో దాడి

గంజాయి మత్తులో యువకుడిపై కత్తులతో దాడి

గోల్కొండలో గంజాయి మత్తులో ఉన్న యువకుడిపై కత్తులతో దాడి జరిగింది. దుండగులు కత్తులతో పొడిచి, గొంతు కోసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కుప్పకూలిన మహమ్మద్ రహీంను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. గోల్కొండ పీస్ కమిటీ సభ్యుడైన మహమ్మద్ రహీంపై దర్గా ఉరుసు వేడుకల సమయంలో ఇస్మాయిల్, తాహిర్ అనే అన్నదమ్ములు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. దాడికి పాల్పడిన ఇస్మాయిల్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. మరో నిందితుడు తాహిర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు హత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

వీడియోలు


హైదరాబాద్