
బతుకమ్మ సందర్బంగా చీరల పంపిణీ
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమాన్ నగర్ డివిజన్లోని బిజేఆర్ నగర్ కాలనీలో గురువారం బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రజావేలుగు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూబ్లీహిల్స్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ అందరికీ చీరలను పంపిణీ చేశారు. మహిళలందరూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మను ఆడాలని అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి. సుదర్శన్, విజయ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.






















