అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని వారి నివాసాలకు వెళ్లి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్లు 352, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద ఇద్దరిపై కేసు నమోదైంది.