
హైదరాబాద్ ఇంచార్జ్‌గా డాక్టర్ శ్రీలత రాణి బాధ్యతల స్వీకరణ
తెలంగాణ బీజేపీ కార్మిక విభాగం మీడియా కన్వీనర్‌గా గంటి నగేష్ శర్మ నియమితులయ్యారు. రాష్ట్ర కార్యాలయంలో అందె శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నగేష్ తెలిపారు. ఇదే కార్యక్రమంలో బీజేపీ కార్మిక విభాగం హైదరాబాద్ ఇంచార్జ్‌గా లయన్ డాక్టర్ శ్రీలత రాణి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్, పాలకుర్తి శేషగిరిరావు, జిల్లా కన్వీనర్లు, ఐటీ, స్కిల్డ్ లేబర్ విభాగాల నాయకులు పాల్గొన్నారు.



























