
వీడిన మహిళ మర్డర్ మిస్టరీ
హైదరాబాద్‌లోని మీర్పేట్లో జరిగిన అనిత అనే మహిళ హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న రాజ్‌కుమార్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. రాజ్‌కుమార్ గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి, ప్రస్తుతం షేర్ మార్కెట్లో రూ.4 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. బంగారం దొంగిలించేందుకు పక్కా ప్లాన్‌తో హెల్మెట్ పెట్టుకొని అనిత ఇంట్లోకి చొరబడిన రాజ్‌కుమార్ ను ఆమె గుర్తించి కేకలు వేయడంతో హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.































