జింక మాంసం కలకలం

2చూసినవారు
జింక మాంసం కలకలం
హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో నిర్వహించిన వాహన తనిఖీల్లో జింక మాంసం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో సయ్యద్ హుస్సేన్, సయ్యద్ ఒమర్, మహ్మద్ హమీద్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి స్కార్పియో కారు, రైఫిల్, బుల్లెట్లు, నైట్ విజన్ టెలిస్కోపులను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని కలబురగి అటవీ ప్రాంతంలో జింకల వేట కోసం వీరు 12 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిపై ఆర్మ్స్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్