
వయోవృద్ధుల కమిషన్ ఏర్పాటు స్వాగతనీయం
ఘట్ కేసర్ లో జరిగిన సమావేశంలో, వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనంలో 15 శాతం లేదా రూ. 10,000లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు భృతిగా చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ చట్టం–2026 వృద్ధుల సంక్షేమానికి దోహదపడుతుందని డెమొక్రటిక్ సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, తోట రంగయ్య, ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ తెలిపారు. ఈ చట్టం అమలుకు ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషనర్ గా జస్టిస్ ఇ. తిరుమల దేవిని నియమించడం అభినందనీయమని, ప్రైవేట్ రంగ ఉద్యోగులను కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకొని వచ్చేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు. వయోవృద్ధుల కమిషన్ ఏర్పాటు స్వాగతనీయమని వారు పేర్కొన్నారు.





























