కొంపల్లిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని కారు, వెంకట్ అనే వ్యక్తికి చెందిన స్పెండర్ బైక్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్, ఆయన భార్య పద్మ, ఇద్దరు కూతుర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను మెరుగైన చికిత్స కోసం స్థానిక సీఎంఆర్ (CMR) ఆసుపత్రికి తరలించారు. కారు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.