
ఈస్ట్ పారసీగుట్టలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
హైదరాబాద్లోని ఈస్ట్ పారసీగుట్టలో జరిగిన ఉత్సవాలలో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్ శుక్రవారం పాల్గొన్నారు. ప్రజా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆకుల అరుణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. నిర్వాహకులు ఆయనను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎన్. శ్రీనివాస్ రావు, ముఠా జయసింహ, శ్రీధర్ రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.























