నాంపల్లి - Nampally

నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా హైదరాబాద్ సహా మూడు జిల్లాల్లోని 12 చోట్ల ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఎర్రగడ్డ కల్పతరు అపార్ట్‌మెంట్స్‌లోని లక్ష్మీ భాస్కర్ నివాసంతో పాటు, ఆయనకు సంబంధించిన ఇతర నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో భాగంగా ఆస్తులు, డాక్యుమెంట్లు, నగదు వంటి వాటిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు పూర్తయ్యాక ఆస్తుల వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వీడియోలు


హైదరాబాద్