
ఇంటి మేడపై నిద్రిస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఒకరు మృతి
వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అక్క ఇంట్లో శుభకార్యానికి వచ్చిన కొడంగల్ మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన తమ్ముడు గొల్ల కృష్ణయ్య (32) అనే యువ రైతు, రాత్రి సమయంలో ఇంటి మేడపై నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతుడి భార్య గొల్ల కాశమ్మ (28) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ మృతికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నారు. అతని ఆకస్మిక మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.





















