
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. అహ్మదాబాద్ నుంచి శంషాబాద్‌కు చేరుకున్న విమానంలో బాంబు ఉందని ఓ విద్యార్థి చేసిన వ్యాఖ్యలతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానంలో మొత్తం 47 మంది విద్యార్థులు ఉన్నారు. ల్యాండింగ్ తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేసి, భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.































