
తిరుమలగిరిలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ, మలాని కాలనీల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకల్లో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు. బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు.




















