
ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ నిరసనలో ఎమ్మెల్యే శ్రీగణేష్
న్యూఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటర్ల హక్కులకు విఘాతం కలిగించే అక్రమాలు జరుగుతున్నాయని, బీజేపీకి అనుకూలంగా ఎన్నికల పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.






























