
అశోక్నగర్లో దారుణం
చిక్కడపల్లి అశోక్నగర్లో గురువారం దారుణ హత్య కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, దుండగులు తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. స్థానిక కిరాణా షాపు వద్ద రోడ్డుపై నిద్రిస్తున్న సుభాష్ (40)ను సుత్తితో కొట్టి చంపినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.



























