శేరిలింగంపల్లి - Serilingampally

వీడియోలు


రంగారెడ్డి జిల్లా
Oct 13, 2026, 05:10 IST/అంబర్‌పేట్
అంబర్‌పేట్

కొడుకును పట్టుకొని కదులుతున్న రైలు ఎక్కబోయి కింద పడ్డ వ్యక్తి

Oct 13, 2026, 05:10 IST
హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం కదులుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలును ఓ వ్యక్తి తన కొడుకుతో ఎక్కబోయి పట్టుతప్పి ప్లాట్‌ఫారమ్‌కు, రైలుకు మధ్యలో పడిపోతుండగా అతన్ని ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ రీనాకుమారి కాపాడారు. అప్రమత్తమైన రీనాకుమారి అతన్ని గట్టిగా పట్టుకుని ప్లాట్‌ఫారమ్ వైపు లాగడంతో ప్రాణాపాయం తప్పింది. లోకో పైలట్ కూడా అత్యవసర బ్రేకులు వేసి రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. అనంతరం ఆ వ్యక్తి తన కుటుంబంతో కలిసి సురక్షితంగా రైలు ఎక్కారు. కానిస్టేబుల్ రీనాకుమారిపై ఉన్నతాధికారులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.