
జింక మాంసం తరలిస్తున్న వేటగాళ్ళను పట్టుకున్న SOT పోలీసులు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టోల్ ప్లాజా వద్ద కారులో జింక మాంసం తరలిస్తున్నారనే సమాచారం తో SOT పోలీసులు తనిఖీలు చేయగా కారులో తరలిస్తున్న 13 కిలోల జింక మాంసం తో పాటు, వేటకు ఉపయోగించిన రైఫీల్ తో ఎనిమిది మంది పట్టుబడ్డారు. తనిఖీల్లో పట్టుబడ్డ మాంసం, రైఫీల్ తో పాటు రెండు కార్లని స్వాదినం చేసుకుని, ఎనిమిది మందిని SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొత్తూరు పోలీసులకు అప్పగించారు.






































