ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన లారీ

23చూసినవారు
ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన లారీ
షాద్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్ టౌన్‌షిప్ వద్ద పాత జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్యోగులను ఎక్కించుకోవడానికి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఎంఎస్ఎన్ ఫార్మా పరిశ్రమ బస్సును, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. బస్సులోని పలువురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్