
ఉరేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దసరా పండుగ సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ బోయిని మల్లేశం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇతనికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. మృతుడు నిన్న రోజంతా తన కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపారు, అయితే రాత్రి సమయంలో తన బెడ్రూమ్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.



















