
వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్
ఐఎస్ సదన్ డివిజన్ అధ్యక్షుడు కుంట సంతోష్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బుయాకార మణికంఠ ఆహ్వానం మేరకు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, వినయ్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మంగళవారం సందర్శించి గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నగరి దాస్, దేవీ, సరోజు, కార్యకర్తలు, యువత, భక్తులు పాల్గొన్నారు.

















