హ్యుందాయ్ కార్ల ధరల పెంపు

11647చూసినవారు
హ్యుందాయ్ కార్ల ధరల పెంపు
సెప్టెంబర్ నుంచి హ్యుందాయ్ కార్ల ధరలు ఒక శాతం వరకు పెరగనున్నాయి. ముడిసరుకు ఖర్చులు, నిర్వహణ వ్యయాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారులపై కొంత భారం మోపుతున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఇది మూడోసారి ధరల పెంపు కాగా, జనవరి 1న 0.6%, జూలై 1న 1% ధరలు పెరిగాయి. మోడల్‌ను బట్టి రూ.12,800 వరకు భారం పడనుంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్ కూడా ఇదే కారణాలతో ధరలు పెంచాయి.

సంబంధిత పోస్ట్