దిల్లీలో నిరసనలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై కేరళలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యంగ్యంగా స్పందించారు. ఈ విషయంలో తనను ప్రశ్నించడం సరికాదని, తాను ట్రావెల్ ఏజెంట్‌ను కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తికి సొంత బాధ్యతలు ఉంటాయని, కాబట్టి రాహుల్ గాంధీ ఎందుకు వెళ్లారో తాను చెప్పలేనని శశిథరూర్ పేర్కొన్నారు. వ్యక్తిగత బాధ్యతల దృష్ట్యా తాను కూడా దిల్లీని వదిలి ఇక్కడికి వచ్చానని ఆయన ఈ సందర్భంగా వివరించారు.