TG: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పొన్నాల ఖండించారు. ‘నేను ఏ పార్టీలోకి వెళ్లట్లేదు. అవన్నీ అసత్య ప్రచారాలే. నేను బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. కాగా ఆయనకు కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చిందని, దీంతో బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరనున్నారని వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందే పొన్నాల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు.