అమెరికా అధ్యక్షులందరిలో నేనే 'గ్రేటెస్ట్': ట్రంప్

9985చూసినవారు
అమెరికా అధ్యక్షులందరిలో నేనే 'గ్రేటెస్ట్': ట్రంప్
తన అధ్యక్ష పదవిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా చరిత్రలోని అధ్యక్షులందరిలో తనకు తానే ‘ది గ్రేటెస్ట్’ ర్యాంక్ ఇచ్చుకున్నారు. మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్‌లకు ‘గ్రేట్’ కేటగిరీ ఇచ్చిన ట్రంప్.. థియోడర్ రూజ్‌వెల్ట్‌ను ‘నియర్ గ్రేట్’గా పేర్కొన్నారు. బిల్ క్లింటన్‌కు ‘యావరేజ్’ ర్యాంక్ ఇవ్వగా.. బరాక్ ఒబామా, జో బైడెన్, జిమ్మీ కార్టర్‌లను ‘ఫెయిల్యూర్స్’గా అభివర్ణించారు. రొనాల్డ్ రీగన్, జాన్ ఎఫ్. కెనడీ సహా పలువురు మాజీ అధ్యక్షులకు తన ర్యాంకింగ్‌లో చోటు కల్పించలేదు.

సంబంధిత పోస్ట్