
కుప్పంలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట
AP: చిత్తూరు జిల్లాలోని కుప్పం మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తున్న అభ్యర్థులను టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో, టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ముగ్గురు టీడీపీ నేతలు, ఇద్దరు వైఎస్సార్సీపీ వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి, రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.




