హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తన కలలను వెంబడించేందుకు 16 ఏళ్ల వయసులోనే ఇంటిని వదిలి వైజాగ్ నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు తెలిపారు. ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొందామని ఆ సమయంలో అనుకున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాన్ని పంచుకున్నారు. తన తల్లిదండ్రులు తనను ఎంతగానో ప్రోత్సహించారని, ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం ప్రత్యేకమైనదని, విజయం అంటే భారీ సినిమాల్లో నటించడమే కాదని శోభిత అభిప్రాయపడ్డారు.