
చీరకట్టుతో పరుగెత్తి వైరల్.. ఉద్యోగానికి అడుగు దూరంలో ఆగిన కవిత
జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాకు చెందిన కవిత హోంగార్డు ఉద్యోగ నియామక పరీక్షలో విఫలమైంది. చీరకట్టుతో పరుగు పందెంలో అద్భుత ప్రతిభ చూపి అందరినీ ఆకట్టుకున్న కవిత, 1600 మీటర్ల పరుగును కేవలం 8 నిమిషాల 57 సెకన్లలోనే పూర్తి చేసింది. అయితే, తర్వాతి దశ అయిన హైజంప్ పరీక్షలో మూడుసార్లు ప్రయత్నించినా విఫలం కావడంతో ఆమె అనర్హురాలిగా ప్రకటించబడింది. భర్త మరణం తర్వాత ఇద్దరు పిల్లలు, అత్తామామల బాధ్యత మోస్తున్న కవిత, పేదరికం కారణంగా కనీస సౌకర్యాలు లేకపోయినా ఉద్యోగం కోసం ఎంతో పోరాడింది.




