2026 నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడంపై
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పరిష్కరించిన ఎనిమిది యుద్ధాలకు గాను ఎనిమిది నోబెల్ బహుమతులు రావాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికాకు చెందిన నవీ పిళ్లైకి ఈ పురస్కారం దక్కడంపై స్పందిస్తూ.. నోబెల్ కమిటీ నిర్ణయం నార్వేకు శాశ్వత మచ్చ అని ట్రంప్ మండిపడ్డారు.
భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని నివారించానని, ఇరాన్ను అణుబాంబు సాధించకుండా అడ్డుకున్నానని కూడా ఆయన తెలిపారు.