ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన రిషభ్ పంత్ ఆరో స్థానంలో, శుభ్‌మన్ గిల్ ఏడో స్థానంలో, యశస్వి జైస్వాల్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ మొదటి స్థానంలో కొనసాగుతున్నట్లు
ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.