నిబంధనల ఉల్లంఘన.. షఫాలీ వర్మకు ఐసీసీ షాక్

0చూసినవారు
నిబంధనల ఉల్లంఘన.. షఫాలీ వర్మకు ఐసీసీ షాక్
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 'కోడ్ ఆఫ్ కాండక్ట్' ఉల్లంఘించినందుకు భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఫీల్డింగ్‌లో కోపంతో బంతిని నేలకేసి విసిరినందుకు ఆమెను మందలించి, ఒక డీమెరిట్ పాయింట్‌ను జతచేసింది. అయితే, అదే మ్యాచ్‌లో షఫాలీ 25 బంతుల్లో 55 పరుగులు చేసి, ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా స్మృతి మంధాన రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది.

సంబంధిత పోస్ట్