‘ఆదర్శ కుటుంబం’ విడుదల వాయిదా

7531చూసినవారు
అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ కీలక పాత్రలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47’ విడుదల వాయిదా పడింది. నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత అనుకున్న తేదీ ప్రకారం అక్టోబరు 9న ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఇంకా పూర్తికాకపోవడం వల్ల సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్తతో వెంకటేశ్‌ అభిమానులు నిరాశ చెందారు.

సంబంధిత పోస్ట్