
నేను తిట్టినట్లు, కొట్టినట్లు ఆధారాలుంటే బయటపెట్టండి: ఎమ్మెల్యే కొలికపూడి
AP: రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య ఆరోపణలపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు రాసిన లేఖపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. తాను ఎవరైనా టీచర్ను తిట్టినట్లు, కొట్టినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలు నిరూపిస్తే తలవంచుకుని వెళ్లిపోతానని, తప్పు లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు.




