అక్రమ అండాల దందా.. కొనసాగుతున్న దర్యాప్తు

40చూసినవారు
అక్రమ అండాల దందా.. కొనసాగుతున్న దర్యాప్తు
TG: హైదరాబాద్‌లో నకిలీ పత్రాలు సృష్టించి మహిళల నుంచి అక్రమంగా అండాలను సేకరిస్తున్న ముఠా వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దందా ద్వారా ముఠా కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు. ఒక్క ఏఆర్‌టీ కేంద్రానికే ఏడాదికి రూ.2 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. కేసులో నిందితులను కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్