సెప్టెంబర్‌లో వర్షాలు తక్కువే.. ఐఎండీ షాకింగ్ రిపోర్ట్

48చూసినవారు
సెప్టెంబర్‌లో వర్షాలు తక్కువే.. ఐఎండీ షాకింగ్ రిపోర్ట్
సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 91 శాతం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశముండగా, సాధారణంగా సెప్టెంబర్‌లో 167.9 మి.మీ వర్షపాతం నమోదవుతుంది. మరోవైపు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉండొచ్చని తెలిపింది. పసిఫిక్‌లో బలపడుతున్న ఎల్‌నినో పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొంది. వర్షాభావంతో వ్యవసాయం, జలవనరులు, తాగునీటిపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్