బీఆర్‌ఎస్‌లో చేరికలు

9చూసినవారు
బీఆర్‌ఎస్‌లో చేరికలు
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఖైరతాబాద్‌కు చెందిన సీనియర్ మైనారిటీ నాయకుడు జిబ్రాన్ షరీఫ్ బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాహుల్ గాంధీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వరుస స్కామ్‌లు జరుగుతున్నాయని, రేవంత్ రెడ్డి పాలనలో ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి లేదని కేటీఆర్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్