రైతులు వ్యవసాయంతో పాటు నాటుకోళ్ల పెంపకం చేపడితే లాభాలు పొందొచ్చని అధికారులు సూచిస్తున్నారు. దీనికి స్వయం సహాయక సంఘాల నుంచి లోన్ తీసుకోవచ్చు. మక్క, జొన్న, బియ్యం, గోధుమలతో చేసిన సహజసిద్ధమైన దాణాను వేయొచ్చు. ఆరోగ్యదాయకమైన మాంసం, గుడ్లను అందించటంతోపాటు స్వగ్రామంలోనే స్వయం ఉపాధిని దీంతో పొందొచ్చు. కిలో బరువు ఉండే జాతి కోడి రూ.5 వేల వరకు నెలలోపు చిన్న పిల్లలు రూ.300ల వరకు ధర పలుకుతాయి.