TG: తెలంగాణ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి వరి సాగు తగ్గడంతో సన్నరకం ధాన్యానికి డిమాండ్ పెరిగింది. బియ్యం ధరలు పెరుగుతుండటంతో మిల్లర్లు, వ్యాపారులు రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జైశ్రీరామ్, ఆర్‌ఎన్‌ఆర్ రకాలు క్వింటాల్‌కు రూ.4,000 వరకు ధర పలుకుతున్నాయి.