TG; సామాన్య వినియోగదారులకు తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (విజయ తెలంగాణ) షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పలు రకాలైన విజయ పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన కొత్త ధరలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. డబుల్ టోన్డ్ మిల్క్ 500 మి.లీ, కౌ మిల్క్ 500 మి.లీ., టోన్డ్ మిల్క్ 500 మి.లీ., SPL టీఎమ్ 500 మి.లీ పై ఒక రూపాయి పెంచగా.. టోన్డ్ మిల్క్ 1000 మి.లీ. పై రూ.2 పెంచింది. సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 150 మి.లీ, 200 మి.లీ చిన్న ప్యాకెట్లు, 500 మి.లీ. స్టాండర్డైజ్ పాల ధరలను మార్చలేదు.