TG: హైదరాబాద్‌లో చలి తీవ్రత పెరుగుతోంది. రాజేంద్రనగర్‌లో నగరంలోనే అత్యల్పంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4.8 డిగ్రీలు తక్కువ. పటాన్‌చెరులో 12.6, కుత్బుల్లాపూర్‌లో 14.1, శేరిలింగంపల్లిలో 14.2, కూకట్‌పల్లిలో 14.5, అమీన్‌పూర్‌లో 14.9, బీహెచ్‌ఈఎల్‌లో 15.1 డిగ్రీలు రికార్డయ్యాయి. నగర సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 16.1 డిగ్రీలుగా ఉంది. నగర కేంద్రం, శివారు ప్రాంతాల మధ్య 5–6 డిగ్రీల వ్యత్యాసం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.