నేడు IND vs NZ మూడో T20.. భారీ వర్షం

1చూసినవారు
నేడు IND vs NZ మూడో T20.. భారీ వర్షం
న్యూజిలాండ్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో T20 మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే, వెల్లింగ్టన్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మ్యాచ్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. వర్షం ఇలాగే కొనసాగితే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ జరిగితే కివీస్ జట్టు సిరీస్‌లో నిలవాలంటే గెలవడం తప్పనిసరి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్