దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ
క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా
భారత్-ఎ, పాకిస్థాన్-ఎ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. పాకిస్థాన్-ఎ కెప్టెన్ అబ్దుల్ సమద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, తిలక్ వర్మ నేతృత్వంలోని
భారత్-ఎ బౌలింగ్‌కు సిద్ధమైంది. అయితే, టాస్ సమయంలో నాణెం విషయంలో అబ్దుల్ సమద్ వాదనకు దిగడం, ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ చేసుకోకపోవడం మైదానంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.